ఆపరేషన్‌ ఆకర్ష్‌ పార్ట్‌ 3.. కేసీఆర్‌ నయా ప్లాన్‌

294
Operation Aakarsh Part 3 .. KCR Naya Plan
Operation Aakarsh Part 3 .. KCR Naya Plan

ఇప్పటికే తెలంగాణ రాజకీయాలలో రెండు ఆపరేషన్‌ ఆకర్ష్‌లు ముగిశాయి. మొదటి ఆపరేషన్‌ ఆకర్ష్‌ లో భాగంగా అనేక మంది టీటీడీపీ నేతలు, ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్‌కి రప్పించడంలో సక్సెస్‌ అయ్యారు సీఎం కేసీఆర్‌. 15 మందితో 2014లో ప్రస్థానం మొదలుపెట్టిన టీటీడీపీ 2016కి వచ్చేసరికి కేవలం 3తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరికి ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరిలో ప్రస్తుతం సత్తుపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ మాత్రమే పార్టీలో ఉన్నారు. ఎల్‌బీ నగర్‌ నుంచి గెలిచిన ఆర్‌.కృష్ణయ్య తన దారి తాను చూసుకుంటున్నారు..

ఇక, ఆ తర్వాత ఆపరేషన్‌ ఆకర్ష్‌ పార్ట్‌ 2లో భాగంగా కేసీఆర్‌ అనేక మంది కాంగ్రెస్‌ నేతలకు టీఆర్‌ఎస్‌ గూటికి రప్పించారు. ఇది కూడా విజయవంతంగా పూర్తయింది. తాజాగా, గులాబీ దళపతి ఎన్నికల వేళ ఆపరేషన్‌ ఆకర్ష్‌ పార్ట్‌ 3 షురూ చేశారు. ఇది మొదటి రెండు ఆపరేషన్‌ ఆకర్ష్‌ కంటే భిన్నమైనది. పార్టీలోకి నేతలను ఆహ్వానించి కండువాలు కప్పడం లాంటివి ఏమీ వుండవు. అంతా తెరవెనుక రాజకీయం. ఎన్నికల ముందు చేసే పకడ్బందీ వ్యూహం. అంతా రాజకీయ స్కెచ్‌ అన్నమాట.

ఆపరేషన్‌ ఆకర్ష్‌ థర్డ్‌ పార్ట్‌ ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనే తేడా ఉండదు. ఆ గ్రామం, ఈ గ్రామం అనే ఆలోచన ఉండదు. చివరికి బూతు స్థాయి వరకు చేరుతుంది. ముందుగా మండల స్థాయిలో అంతో ఇంతో పేరున్న కొందరు వ్యతిరేక పార్టీలోని నేతలను ఎంచుకోవడం, వారిని టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షించేలా చేయడం, వారికి భారీ ఎత్తున ఆశ చూపడం, బూతుస్థాయి వరకు ఓట్లను మేనేజ్‌ చేసేలా పక్కా వ్యూహాన్ని రచించడం. ఇదీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ లేటెస్ట్‌ సీక్వెన్స్‌. ఎంతో ఆచించిన కేసీఆర్‌ ఈ వ్యూహానికి తెరదీశారట. మరి, ఆపరేషన్‌ ఆకర్ష్‌ కాంగ్రెస్‌కి ఎలాంటి పంచ్‌ విసరబోతోందో చూడాలి.