పరకాల సర్వే రిపోర్ట్ ఇదేనా : అందుకే లగడపాటిని రంగంలోకి దింపారు బాబు..

6589
Parikala Survey Report: chandrababu in game to lagadapati
Parikala Survey Report: chandrababu in game to lagadapati

మరికొన్ని గంటల్లో తెలంగాణ పోలింగ్ జరగబోతున్నది. ఓటరు తీర్పు చెప్పబోతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయి అనేది డిసెంబర్ 11వ తేదీనే క్లారిటీకి వచ్చేది ఉన్నా.. రాజకీయ పార్టీలు, ఏజెన్సీలు సర్వేలతో హడావిడి చేస్తున్నాయి. లగడపాటి సర్వేపై రాద్దాంతం వెనక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మాత్రమే సర్వే వెల్లడిస్తాను అని లగడపాటి పదేపదే స్పష్టం చేసినా.. ముందుగా ఎందుకు ప్రకటించారనేది ప్రశ్నగా మారింది. దీని వెనక ఉన్నది చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా అని స్పష్టంగా అర్థం అవుతున్నా.. ఇంత హడావిడిగా లగడపాటిని తెరపైకి తీసుకురావటం వెనక కారణం మాత్రం పరకాల ప్రభాకర్. అవును.. చంద్రబాబుకి నమ్మినబంటు.. ఏపీ మీడియా సలహాదారుగా.. టీడీపీ సోషల్ మీడియా అడ్వయిజరీగా పని చేసిన పరకాల ప్రభాకర్ చేసిన సర్వేలో కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. దీనిపై అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసిన బాబు.. పరకాల కంటే ముందుగానే లగడపాటిని రంగంలోకి దించారంట. సర్వే ఫలితాలు మార్చి విడుదల చేయాలని పరకాలపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారంట. అందుకు ఆయన అంగీకరించలేదంట. పరకాల ఎక్కడ తన సర్వే రిపోర్ట్ వెల్లడిస్తారో అనే భయంతో.. వెంటనే లడపాటిని హడావిడిగా రంగంలోకి దించారంట.

పరకాల సర్వే రిజల్ట్స్ :

టీఆర్ఎస్ : 72-75 సీట్లు
కాంగ్రెస్ : 26-28 సీట్లు
టీడీపీ : 4-5 సీట్లు
ఎంఐఎం : 7 సీట్లు
బీజేపీ : 2 సీట్లు
ఇతరులు : 2 సీట్లు

మహాకూటమి భారీ ఓటమి మూటగట్టుకోబోతున్నది పరకాల ప్రభాకర్ సర్వే స్పష్టం చేస్తోంది. రెండు నెలలుగా.. 8 వారాలు నిరంతరం ప్రజాభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ ఫలితాలు వచ్చాయంట పరకాల టీంకి . పరకాల సర్వే ఫలితాలతో కూటమికి చావుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ కు మరికొన్ని గంటలు సమయం మాత్రమే ఉన్న ఈటైంలో.. పరకాల సర్వే లీక్ అంటూ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సర్వేలు, విశ్లేషణల్లో మేధావిగా ప్రాచుర్యంలో ఉన్న పరకాల సర్వేపైనే ఇన్నాళ్లు చంద్రబాబు ఆధారపడ్డారు. కూటమికి వ్యతిరేకంగా పరకాల రిపోర్ట్ ఇవ్వటం వల్లే ఆయన్ను పక్కనబెట్టి.. లగడపాటిని లైన్ లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. లగడపాటి ద్వారా ద్వారా తప్పుడు సర్వేలు ఇప్పిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ సమయంలోనే పరకాల సర్వే ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఓ రిపోర్ట్ హల్ చల్ చేయటం విశేషం…