గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర

50

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర గుంటూరు ఈ రోజు గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది.  బాపట్లలో స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు.. బాపట్లలో సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు.

అంతకముందు ప్రకాశం జిల్లా ఈపూరు పాళెంలో జరిగిన వైఎస్సార్ సీపీ ఆవిర్భావ సభలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, 50కిలోల భారీ కేక్ ను కట్ చేశారు.