రామ్ చరణ్ చిత్రం నుంచి ఫస్ట్ లుక్… టైటిల్ అదే

158
ramcharan new movie
ramcharan new movie

బోయపాటి శీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ” వినయ విధేయ రామ” ఈ చిత్రం నుంచి ఇప్పటిదాక ఎటువంటి వార్తలు వెలవడనప్పటికి ప్రస్తుతం దీపావళి సందర్బంగా మెగా అభిమానులకు పండగ వాతవరణం అందివ్వడానికి ఈ రోజు విడుదల చేశారు.. చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది..

బోయపాటి యాక్షన్ మార్క్ కి తగినట్టుగా, శత్రువులపై విరుచుకుపడుతూ చరణ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చరణ్ లుక్ ఆయన అభిమానులను ఖుషీ చేస్తుందనే చెప్పాలి. ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ఉదయం 10:25 గంటలకు టీజర్ ను వదలనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ప్రశాంత్ .. స్నేహ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. కాగా అభిమానుల్లో మాత్రం రమొక్కసారి చరణ్ పై భారీ అంచనాలనే రేకెత్తిస్తున్నారని ఈ సారికూడా తప్పకుండా చరణ్ తన మార్కుని సొంతం చేసుకుంటాడని అంటున్నారు.. మరి సినిమా విడుదల వరకు వేచి చూడాల్సి ఉంది..