కర్నూల్ లో కలకలం రేపిన రేవ్ పార్టీ..

129
Rave Party in Kurnool ..
Rave Party in Kurnool ..

రేవ్ పార్టీలకు అనుమతి ఉండదు.. కానీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.. వీటి గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పట్టుకుంటున్నారే తప్ప ఇలాంటివి జరగకుండా ఆపలేక పోతున్నారు… ఇలాంటి సంఘన ప్రస్తుతం కర్నూల్ జిల్లా లో దీపావళి సందర్బంగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

దీపావళి సందర్బంగా కర్నూలు జిల్లాలోని అగ్రికల్చర్ కు సంబందించిన ఫర్టిలైజర్ దుకాణ దారులు పండుగ సందర్బంగా ఆ ఫారన్ కల్చర్ అయిన రేవ్ పార్టీని చేసుకున్నారు.. కాగా ఇందులో భాగంగా పార్టీలో నృత్యం చేయడానికి వచ్చిన యువతుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారిలో వాళ్లే గొడవ పడ్డారు.. ఇది కాస్తా ఎక్కువ కావడంతో తాము పార్టీలో డ్యాన్స్ చేయలేమని బెంగళూరు, హైదరాబాద్, ముంబై నుంచి వచ్చిన యువతులు చెప్పడంతో వారు మధ్య మంరిత తారాస్థాయికి చెరింది.. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న మీడియా, పోలీసులు అక్కడి చేరుకున్నారు.. అనంతరం పోలీసులు నిర్వాహకులను అదుపు లోకి తీసుకున్నారు..

ఈ గొడవకు కారణం పార్టీలో పాల్గొన్న ఏజంట్ల సంఖ్య అధికంగా ఉండటం, డ్యాన్సులు వేసేందుకు వచ్చిన యువతుల సంఖ్య తక్కువగా ఉండటంతోనే గొడవ ప్రారంభమైనట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. కాగా ఇందు ఏజంట్లు యుతులతో ఏకాంతంగా గడపడానికి మెమంటే మెమంటూ గోడవ పడ్డారు.. అంతటితో పార్టీ కాస్తా గందర గోలంగా మారింది.. డ్యాన్స్ చేయడానికి వచ్చిన యువతులు కూడా ఇబ్బంది పడటంతో వెళ్లి పోతామని చెప్పారు.. నిర్వాహకులపై, ఏజంట్ల గొడవకు దిగారు.. పార్టీ కాస్తా మధ్యలోనే ముగిసి పోయింది.. కాగా ఈ పార్టీ నిర్వాకహులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హజరు పరచనున్నట్లు తెలిపారు..