అదరగొడుతున్న “త్రీబుల్ ఎ” లిరికల్ సాంగ్… రవితేజ దీపావళి కానుక

71
amar akbar anthoni , movie lirical song
amar akbar anthoni , movie lirical song

మాస్ మహారాజ్ గా తెలుగు ప్రక్షకుల అభిమానాలు పొందుతున్న నటుడు రవితేజ తాజాగా నటించిన చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రం నుంచి దర్శకుడు శ్రీను వైట్ల మరియు చిత్ర యునిట్ ఈ రోజు లిరికల్ సాంగ్ విడుదల చేశారు.. ఇక ఈ చిత్రం లో కథానాయికగా గోవా బ్యూటీ ఇలియానా నటించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం నుండి ” హే హలో హలో డాన్ బాస్కో.. ఛల్ ఛల్ పంజూస్కో.. పడి పడి ఎంతైనా ట్రై చేస్కో నే దోరకను కాస్కో” అనే సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.. కాగా ప్రస్తుతం ఇంటర్ నెట్ లో సాంగ్ వైరల్ గా మారుతోంది..

ఈ పాటలో తమన్ సంగీతం అందించారు.. రచయిత విశ్వ రాసిన ఈ పాటను గాయకుడు శ్రీకృష్ణ, జస్ప్రీత్.. రమ్య బెహ్రా తదితరులు ఆలపించారు. ఈ చిత్రానికి సంబందించి ప్రీ రిలేజ్ ఈవెంట్ ను ఈ నెల 10వ తేదిన జరపనున్నట్లు తెలుస్తొంది.. చిత్రం ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది.. ఇప్పటికే ఈచిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.. అందుకు కారణం గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మంచి హిట్ సాదించడమే అని చెప్పవచ్చు..