అల్లూరి సీతారామ‌రాజు, కొమురంభీంల చ‌రిత్రే ” ఆర్ ఆర్ ఆర్ “

210

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కు సంబంధించిన వివరాలను ఎట్టకేలకు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రెస్‌మీట్ లో వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ స్టోరీ రివిల్ చేశారు. సినిమాలో 1897లో ఆంధ్రాలో పుట్టిన అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేశార‌ని , 1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో పుట్టిన కొమురం భీం నిజాం పాల‌నకు వ్య‌తిరేకంగా పోరాటం చేశార‌ని అన్నారు.

అయితే వారిద్ద‌రు క‌లిస్తే ఎలా ఉండేది, ఏం చేసేవారు అనే అంశాల‌పై క‌థ‌ను తెర‌కెక్కిస్తున్న‌ట్లు రాజ‌మౌళి వెల్ల‌డించారు. అల్లూరి , కొమురం భీంల చరిత్ర చాలా ప్రత్యేక‌మైంద‌ని , అందుకే తాను సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టింద‌ని రాజ‌మౌళి వివ‌రించారు.