“మారి 2” లో ఆటో రాణి గెటప్ లో సాయిపల్లవి..

196
sai pallavi new movie in mari 2 , mass look,
sai pallavi new movie in mari 2 , mass look,

ఫిదా చిత్రలో తెలుగు ప్రేక్షకుల పరిచం అయిన భామ సాయిపల్లవి ఈ చిత్రంలో ఎక్కడా లేని క్రేజ్ ని సోంతం చేసుకుంది.. అనంతరం న్యాచురల్ స్టార్ నాని నటించిన “ఎంసీఏ” అనంతరం రెుండు మూడు చిత్రాలు నటించిన సల్లవి ప్రస్తుతం తమిళ్ స్టార్ ధనుష్ నటిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది..

ఇప్పటి వరకు తన యాటిట్యుడ్ తో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఆటో రాణిగా ఖాకీ చొక్కా వేసుకుని, జీన్స్ ఫ్యాంటు లో అదిరిపోయే స్టెప్పులేసే అమ్మాయిగా “మారి 2″లో క‌నిపించ‌బోతోంది. అస‌లే ధ‌నుష్‌కి ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా సాయి ప‌ల్ల‌వి అడిష‌న‌ల్ మాస్ అప్పీల్ “మారి 2″కి ప్ల‌స్ కానుంద‌ని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది.. “మారి” చిత్రంలో దనుష్ సరసన కాజల్ అగర్వాల్ నటించారు.. ఈ చిత్రం హిట్ కావడంతోనే ఇప్పుడు సీక్వెల్ గా “మారీ 2” తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. మరి ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది..