ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్..!

93
sbi reduces non maintenance minimum charges by 75 percent
sbi reduces non maintenance minimum charges by 75 percent

స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

ఇన్నాళ్లూ మినిమన్ ఎమౌంట్ (కనీస మొత్తం) లేని అకౌంట్లకు ఖాతాదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తూ వస్తున్న స్టేట్ బ్యాంక్, తమ కస్టమర్లకు ఇప్పుడు రిలీఫ్ ఇచ్చింది. అర్బన్ ఏరియాలో నెలకు 50 రూపాయలకు పైగా వసూలు చేస్తుండగా, ఆ మొత్తాన్నిగణనీయంగా తగ్గించేసింది. ఇకనుండీ స్టేట్ బ్యాంక్ అర్బన్ ఖాతాదారులు కేవలం రూ. 15 కడితే సరిపోతుంది. ఇక సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.40 నుంచి రూ.12, రూ.10కి తగ్గించేసింది. ఎస్బీఐ తగ్గించిన ఆ ఛార్జీలు ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి అమలులోకి వస్తాయి.

హైదరాబాద్ వంటి మహానగరాల్లో నెలకు రూ.15 వసూలు చేస్తారు. పట్టణాల్లో ఎకౌంట్లు ఉన్న వారు మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే రూ.12 వసూలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వసూలు చేస్తారు. ఓవరాల్ గా కస్టమర్స్ పై పడే భారాన్ని 75 శాతానికి పైగా తగ్గించినట్టుగా ఎస్బీఐ ప్రకటించింది.

చాలా బ్యాంకుల్లో వినియోగదారులకు నడ్డి విరిగేలా ఫైన్లు పడుతున్నాయి. మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేని వారు ఈ బాదుడిని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి ఛార్జీలతో ఏకంగా వేల కోట్ల రూపాయల్ని బ్యాంకులు ఖాతాదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ ఉన్నా, డబ్బులు లేని అనేకమంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ దోపిడీపై నిరసన వ్యక్తం చేశారు. మినిమం ఎమౌంట్ ఛార్జీలను ఎత్తేయాలని చాలా కాలంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆ నిరసనల్ని గమనించిన ఎస్బీఐ, ఛార్జీలను పూర్తిగా ఎత్తేయకుండా, నామమాత్రమపు ఛార్జీలకు కుదించింది.