విశాఖలో సముద్రం 100 మీటర్లు వెనక్కి వెళ్ళింది.. వైరల్ వీడియో

364

విశాఖపట్టణం సముద్ర తీరం లో నీళ్లు వెనక్కి వెళ్లాయి.. నమ్మడానికి వింతగా ఉన్న వీడియో చూస్తే నమ్మాల్సిందే.. విశాఖ రుషికొండ బీచ్ లో సముద్రం 100 మీటర్ల వరకు వెనక్కి వెళ్ళింది.. సముద్ర తీరంలో ఉండే నీళ్లు వెనక్కి వెళ్లడంతో ఒడ్డున నీటిలో ఉండే బండ రాళ్లు బయట పడాయి.. దీనిపై నిఘా పెట్టిన అధికారులు మొన్న సంపూర్ణ చంద్రగ్రహణమే సముద్రం లోపలికి వెళ్లడానికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు.. ఈ ఘటన చూసిన జనాలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టులు, నగరవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపై నడుస్తూ మరింత లోతుకు వెళ్లి వస్తున్నారు. సముద్రం వెనక్కు వెళ్లిన వీడియోను మీరూ చూడవచ్చు..