సింగిల్‌ డిజిటే వస్తే ఎక్కువ.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

105
single digit is greater than the kTR sensational comments
single digit is greater than the kTR sensational comments

టీఆర్‌ఎస్‌ యువనేత, పార్టీ అధినేత కేసీఆర్‌ తనయుడు, ఆయన రాజకీయ వారసుడు కేటీఆర్‌ ప్రతిపక్షాలకు అదిరిపోయే చాలెంజ్‌ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ టీవీ చానెల్‌కి ఇంటర్‌వ్యూ ఇచ్చారు. అందులో సీనియర్‌ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేటీఆర్‌.. జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి 100కి పైగా స్థానాలు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్‌. తమ తర్వాతి స్థానం MIMదే అని, ఆ పార్టీకి 7-9 స్థానాలు దక్కుతాయని తెలిపారు.. ఇక, కాంగ్రెస్‌ -టీడీపీ – టీజేఎస్‌ – సీపీఐ కూటమి సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. కూటమి కంటే MIMకే ఎక్కువ నియోజకవర్గాలు దక్కుతాయని బాంబ్‌ పేల్చారు కేటీఆర్‌..

ప్రజల్లో టీఆర్‌ఎస్‌ వేవ్‌ కనిపిస్తోందని, తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నానని, ఇంతవరకు సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఖరారే తేల్చుకోలేని మహాకూటమి టీఆర్‌ఎస్‌కి పోటీ కానేకాదని తేల్చిపారేశారు టీఆర్‌ఎస్‌ యువనేత. కాంగ్రెస్‌ సీనియర్లు సైతం ఈ ఎన్నికల్లో మట్టి కరవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇదంతా తాను చెబుతున్న గాలి లెక్కలు కాదని, పక్కా సర్వేలు చేసిన తర్వాత ధీమాతో చెబుతున్న అంశాలని తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు కేటీఆర్‌..

హరీశ్ తో విబేధాలు లేవు : కేటీఆర్

హరీష్‌ రావుతో తమకు ఎలాంటి సమస్య లేదని, ఆయన కేసీఆర్‌కే పూర్తి నమ్మకస్తుడని కేటీఆర్‌ విశ్వాసం వెలిబుచ్చారు. తనకు, హరీష్‌కి తొలి ప్రాధాన్యం కుటుంబమే ముఖ్యమన్నారు. రెండో స్థానం పార్టీకి అన్నారు కేటీఆర్‌. కాంగ్రెస్‌కి సింగిల్‌ డిజిట్‌కంటే ఎక్కువ స్థానాలు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తన చాలెంజ్‌ని అంగీకరించి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కానీ, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఎవరు ముందుకు వచ్చినా తాను స్వీకరిస్తానని చాలెంజ్‌ చేశారు కేటీఆర్‌. కేటీఆర్‌ చాలెంజ్‌ చేసి 48 గంటలవుతున్నా ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదంటే టీఆర్‌ఎస్‌ విజయం గ్యారంటీ అని భావించకతప్పదు. హస్తినలో సీట్ల కసరత్తులో బిజీగా ఉన్న టీకాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌ వచ్చిన తర్వాత అయినా కౌంటర్‌ ఇస్తారేమో చూడాలి. కాంగ్రెస్‌ నేతలకి అంత సత్తా ఉందా…? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.