నాకు చిత్రకారుడు పవన్ తెలుసు.. మరే పవన్ తెలియదు.. : శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే ఎవరో తెలియదని మరోసారి శ్రీ రెడ్డి వివాదం .. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులు. గతంలో కాస్టింగ్ కౌచ్ పై స్పందించమని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కోరి అనంతరం అనుచిత వ్యాఖ్యాలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాన్ని రేకెత్తించిన శ్రీ రెడ్డి నేడు తనకు చిత్రకారుడు పవన్ బన్వాలాల్ తెలుసని, ఆయన గొప్ప పెయింటర్ అని చెబుతూ ఆయన తప్ప మిగతా పవన్ లు ఎవరు తెలియదని వ్యాఖ్యానించింది. దేశంలో చాలా మంది పవన్ లు ఉంటారని, వారందరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదంటూ మరో వివాదానికి తెరతీసింది.