శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో మ‌హిళ‌ల ప్ర‌వేశంపై సుప్రీం కోర్టు చారిత్ర‌క తీర్పు..!

73
supreme court
supreme court

ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రం శ‌బ‌రిమ‌లై ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆధ్యాత్మిక విష‌యంలో వివ‌క్ష చూప‌కూడ‌ద‌నే, అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని సంద‌ర్శించ‌వ‌చ్చ‌ని సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. 10 నుంచి 50 ఏళ్ల వ‌య‌స్సు మ‌హిళ‌ల‌పై ఉన్న నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. జీవ సంబంధాల ల‌క్ష‌ణాల ఆధారంగా మ‌హిళ‌ల‌పై వివ‌క్ష ప్ర‌ద‌ర్ఝ‌శించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

దేవ‌స్థానంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని అడ్డుకుంటున్న ఆల‌య నిబంధ‌న‌లు రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14, 25ను ఉల్లంఘిస్తున్నాయ‌ని పేర్కొంది. ఆల‌యాల్లో లింగ వివ‌క్ష‌కు తావు లేద‌ని, మ‌హిళ‌ల‌ను బ‌ల‌హీనులుగా చూడ్డానికి వీల్లేద‌ని సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ మిశ్రా స్ప‌ష్టం చేశారు.

మ‌హిళ‌ల‌ను దేవ‌త‌లా పూజించే దేశంలో లింగ వివ‌క్ష ఆంక్ష‌లు స‌మంజ‌సం కాద‌ని తేల్చి చెప్పింది. ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నంలో న‌లుగురు ఈ తీర్పుతో అంగీక‌రించ‌గా ఏకైక మ‌హిళా న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఇందు మల్హోత్రా భిన్నాభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. స‌తీస‌హ‌గ‌మ‌నం లాంటి సామాజిక రుగ్మ‌త‌లు మిన‌హా మ‌త‌ప‌ర‌మైన విదానాలు తొల‌గించే దానిపై నిర్ణ‌యం తీసుకునే అంశం కోర్టుకు సంబంధించిన‌ది కాద‌ని అమె అన్నారు. దేశంలో లౌకిక వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు బ‌లంగా నాటుకుపోయి ఉన్న మ‌త‌ప‌ర‌మైన ఆచారాల్లో మార్పు చేయొద్ద‌ని జ‌స్టిస్ ఇందు మ‌ల్హోత్రా అభిప్రాయ‌ప‌డ్డారు.