కైట్ ఫెస్టివల్ కోసం ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు..

0

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది. దీనికి సంబందించిన ఏర్పాట్లు పరేడ్ గ్రౌండ్స్ లో ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పర్యాటక శాఖా సెక్రటరీ బుర్రా వెంకటేశం దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
13 నుండి 15 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుందని వెంకటేశం తెలిపారు. ఒక్క కైట్ ఫెస్టివల్ కాకుండా ఫుడ్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, సంగీత విభావరి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అయన తెలిపారు. 20 దేశాలకు సంబందించిన ఔత్సహికులు కైట్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారని బుర్ర వెంకటేశం తెలిపారు.. రోజుకు 30 నుండి 40 వేలమందికి సరిపోయే విధంగా భోజన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు..