ఉపేంద్ర ‘ఐ లవ్ యు’ టీజర్ విడుదల

15
love you teaser relise.
love you teaser relise.

రియల్ స్టార్ ఉపేంద్ర టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. తెలుగులో అప్పుడప్పుడు మెరిపించి మెప్పించిన ఈ హీరో నటిస్తున్న కన్నడ మూవీ ని తెలుగులో ‘ఐ లవ్ యు’ పేరుతో విడుదల చేయనున్నారు. దీనికి ‘నన్నే.. ప్రేమించు’ అని టాగ్ లైన్. ఇందులోభాగంగా నిమిషమున్నర నిడివిగల టీజర్‌ని విడుదల చేశారు చిత్ర యూనిట్.

లవ్ అంటే ఏంటి అనే ప్రశ్న కు చిన్న సమాధానం చెప్పిఇలాంటి ప్రొసెస్‌నే ‘ఐ లవ్ యు’ అంటూ అంటారని మూడు ముక్కల్లో తేల్చేశాడు ఉపేంద్ర . ఓ అమ్మాయిని చూసి ప్రేమించడం ,ఆమె కాదనడం, ఆ తర్వాత ప్రేమ గురుంచి ప్రేమికులకు చెప్పడం ఆ తర్వాత ఏం జరిగిందన్నదే సినిమా అసలు స్టోరీ. టీజర్ చూసినవాళ్లకు 1990ల్లో ఉపేంద్ర చేసిన సినిమాల మాదిరిగానే వుందని అంటున్నారు. కన్నడ నిర్మించిన ఈ చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. మరి ఈ చిత్రంతో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడా ? అంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే .. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.