“సర్కార్ ” రికార్డు ను బ్రేక్ చేసిన ” 2.ఓ “.

53
tamil hero rajinikanth,sankar direction movie ,relise sarkar movie
tamil hero rajinikanth,sankar direction movie ,relise sarkar movie

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత కథానాయకుడి గా శంకర్ దర్శకత్వం లో అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడిగా తెరకెక్కిన చిత్రం ” 2.ఓ” ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదల అయిన కొద్ది వ్యవధి లోనే ఒక సరికొత్త రికార్డు ను సొంతం చేసుకుంది .

కేరళలో అత్యధికంగా 412 థియేటర్లలో విడుదల అయిన చిత్రంగా హీరో విజయ్, మురుగదాస్ దర్శకత్వం లో వచ్చిన “సర్కార్” చిత్రం రికార్డు సొంతం చేసుకుంది ..అయితే
తాజాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ “2.ఓ ” .కేరళలో 458 థియేటర్లలో విడుదలై “సర్కార్” సినిమా రికార్డు ను బ్రేక్ చేసింది. అత్యధిక థియోటర్ లలో విడుదలై సరికొత్త రికార్డు ను సొంతం చేసుకుంది .. 3డీ ఎఫెక్ట్స్ ,4డీ సౌండింగ్ సినిమా కావటం తో కేరళవాసులు ఈ సినీమా చూడటానికి ,ఆసక్తి చూపుతున్నారని శంకర్ డైరెక్షన్ లో ఇంతవరకు చేసిన సినిమాలకు మించి ఉంటుందని ఓపెనింగ్ విషయం లోను సరికొత్త రికార్డు ను సొంతం చేసుకుంటుందని అభిమానుల నుండి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి …