మంగళగిరిలో వీధుల్లో తిరువీధుల హడావిడి

0

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. రాజధాని పరిధిలోని మంగళగిరి లక్ష్మీనరశింహ స్వామి ఆలయం ఇందుకు వేదిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోనే మొదటిసారిగా టీడీపీ తరపున ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టిన వ్యక్తిగా తిరువీధుల శ్రీనివాసరావు (నాని) నిలిచారు. 2019 ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంటుందో ఇది చెబుతోంది. అందుకు మంగళగిరి టీడీపీ యువనేత తిరువీధుల శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు.

LED స్క్రీన్ వెహికల్స్ తో ప్రచారం :

చంద్రబాబు ఆధ్వర్యంలో.. యువనేత లోకేష్ సారధ్యంలో ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ LED స్క్రీన్ వెహికల్స్ మంగళగిరి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా.. రెండు నెలల ముందుగానే ప్రచారాన్ని శుభారంభం చేసింది తెలుగుదేశం పార్టీ. నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన.. వీధివీధిలో వివరిస్తూ తిరుగుతున్నాయి. వీటిని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు ప్రజలు. ఇంటింటికీ వచ్చి చెప్పినట్లు ఉంది అంటున్నారు. కొత్త పుంతల్లో టీడీపీ ప్రచారం సాగటంపై అభిమానులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

తిరువీధుల శ్రీనివాసరావు (నాని) సారధ్యంలో :

ఏపీ రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ LED స్క్రీన్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది మంగళగిరి యువనేత తిరువీధుల శ్రీనివాసరావు(నాని). ఈ ఆధ్వర్యంలోనే నాలుగు వాహనాలు ప్రచారాన్ని ముమ్మరం చేయటంతో యువతో కిక్కు వచ్చింది అంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. యువనేతలు ఆలోచనలు ఎంత భిన్నంగా ఉంటాయి.. తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రయోజనకరంగా ఉంటాయో ఈ కొత్త ఆలోచన చెబుతుంది అంటున్నా పార్టీ సీనియర్స్.

సీనియర్ నేతల మద్దతు నానికే :

LED స్క్రీన్ వెహికల్స్ ప్రచారానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు సీనియర్ నేతలు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు సంకా బాలాజీ గుప్తా, దుగ్గిరాల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కేశంనేని శ్రీధర్, ఉమాయాదవ్ వెహికల్స్ ప్రచారంపై ఆనందం వ్యక్తం చేశారు. తిరువీధుల శ్రీనివాసరావు(నాని) ప్రచార రథాలను పరిశీలించారు. కొత్త ఆలోచన అంటూ ప్రశంసించారు. పార్టీలోకి మీలాంటి చురుకైన యువత రావాలంటూ కొనియాడారు. ఏమైనా మంగళగిరి నుంచి మొదలైన తిరువీధుల శ్రీనివాసరావు(నాని) LED స్క్రీన్ ప్రచారం కొత్త పుంతలు తొక్కిస్తోంది.. సీనియర్ నేతల్లో చర్చనీయాంశం అయ్యింది.