సికింద్రాబాద్ పరిధిలో చైన్ స్నాచింగ్.. ద్విచక్రవాహనం పై వచ్చి మహిళ మెడలోని గోలుసు అపహరణ

0

భాగ్యనగరంలో ఈ మధ్య వరుసగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న తరుణంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నప్పటికి కూడా దొంగలు తమ చేతి వాటం చూపుతున్నారు. 10రోజుల క్రితం ఎల్బీ నగర్ పరిధిలో జరిగిన గొలుసు దొంగలను జనవరి 10వ తేదీన పట్టుకున్న పోలీసులకు తాజాగా గొలుసు దొంగలు మరోచోట చోరీ కి పాల్పడి సవాల్ విసిరారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావ్ నగర్ లో ఓంటరిగా వెలుతున్న మహిళ మెడలోని గోలుసును ద్విచక్రవాహనం పై వచ్చి దుండగులు అపహరించారు. పద్మారావ్ నగర్ లో నివాసం ఉంటున్న భార్గవి అనే మహిళ, తన మిత్రురాలితో కలిసి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కు వెలుతుండగా నిందితులు వెనుక నుండి ద్విచక్ర వాహనంలో వచ్చి ఆమె మెడలో ఉన్న తులం బాంగారు గొలుసు లాక్కోని వెళ్లారని పోలీసులకు తెలిపింది. మహిళ ఇచ్చిన పిర్యాధు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పాట్రోలింగ్ ,క్రైమ్ పోలీసులు చైన్ స్నాచర్ ల కోసం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.