ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సోద‌రుడిపై ఫిర్యాదు చేసిన జీవితా రాజశేఖర్

0

జీవితా రాజశేఖర్ దంప‌తులు మ‌రోసారి పోలీస్‌స్టేష‌న్ మెట్లు ఎక్కారు. కౌశిక్ రెడ్డి అనే కాంగ్రెస్ నేతపై జీవిత రాజశేఖర్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. జీవిత ఏసీపీ ఆఫీస్ లో పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో వైరల్ గా మారింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబ‌రు 45లో ఉన్న గుణ డైమండ్స్ ముందు కౌశిక్‌రెడ్డి త‌న కారును నిలిపి వేరే ప్రాంతానికి వెళ్లాడ‌ని, ఇదేమ‌ని గుణ‌శేఖ‌ర్ ప్ర‌శ్నించినందుకు ప్రాంతం పేరుతో దూషిస్తూ ఆయ‌న‌ను తీవ్రంగా కొట్టాడని ఫిర్యాదులొ పేర్కొన్నారు.

దీనికి సంబంధించి సీసీ ఫుటేజీల‌ను ప‌రిశీలించాల‌ని ఆయ‌న‌ను కోరారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని సూచించ‌డంతో జీవితారాజ‌శేఖ‌ర్‌, గుణ‌శేఖ‌ర్‌లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన ఈ ఘటనలో గుణశేఖర్ బాగా గాయపడినట్లు జీవిత తెలిపారు. కౌశిక్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జీవితా రాజశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. సోమవారం జీవిత భర్త రాజశేఖర్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా కల్కి టీజర్ ను రిలీజ్ చేశారు. కాగా దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కౌశిక్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి దగ్గరి బంధువు కావడం గమనార్హం