ఉమ్రా యాత్రికులకు ఘ‌న‌స్వాగ‌తం

0

ముస్లిం సోదరుల పవిత్రస్థలం ఉమ్రా యాత్ర నుంచి స్వదేశానికి చేరిన బృందానికి వారి కుటుంబ‌స‌భ్యులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. 80మంది యాత్రికులు హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్ర బయలుదేరింది. నగరంలోని అల్ మిజాన్ హజ్ ఒ ఉమ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అల్ హజ్ హఫీజ్ మహ్మద్ ఫయాజ్ అలీ ఆధ్వర్యంలో బయలుదేరారు.

15 రోజుల పాటు పర్యటించి విజయవంతంగా యాత్ర ముగించుకొని స్వదేశానికి వచ్చిన వారికి కుటుంబీకులు, సంబంధీకులు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా బృందం ప్రతి నిధి ఫయాజ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు పవిత్రస్థల సందర్శన యాత్రకు ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుందన్నారు. ప్రభుత్వాల సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

జీవితంలో ఒక్కసారైన ఉమ్రా దర్శించుకోవడం తప్పని సరని తెలిపారు. అక్కడ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందన్నా రు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్ర ముగించుకొని క్షేమంగా రావడం జరుగుతుందని తెలియజేశారు. హైదరాబాద్ నుండి బ‌యలుదేరిన నాటి నుండి ఎలాంటి అసౌకర్యం కలగలేదని అఫేజ్ అన్నారు.

భోజనం నుండి నిద్రించే వరకు తాను దగ్గరుండి పర్య‌వేక్షించినట్లు తెలిపారు. భోజనం కోసం ఇండియా నుండి కుక్ లను సైతం వెంటపెట్టుకుని వచ్చామన్నారు. యాత్ర చాలా సంతోషంగా ఉందని అన్నారు. డబ్బు ప్రతి మనిషి వద్ద ఉంటుంది కానీ పుణ్య‌క్షేత్రాలను దర్శించుకునే భాగ్యం మాత్రం కొందరికి మాత్రమే ఉంటుందని అందులో తాము ఉండడం సంతోషమని అన్నారు