బస్సు స్టేషన్లలో జాతర వాతావరణం..

0

సంక్రాంతి సందర్బంగా ప్రజలు నగరం నుండి సొంత ఊర్లకు వెళ్తుండటంతో బస్సు స్టేషన్స్ లో రద్దీ విపరీతంగా పెరిగింది. సికింద్రాబాద్ జూబ్లీ బస్సు స్టేషన్ లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే 5 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అన్నారు. ట్రాఫిక్ సమస్య లేకపోతే మరి కొన్ని బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు కూడా ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. రద్దీగా ఉన్న సమయంలో దొంగల బెడద ఎక్కువ ఉండే ఆవకాశం ఉండటంతో పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.