వివేకానంద జయంతిని పురస్కరించుకొని దుబ్బాకలో ముగ్గుల పోటీ

0

మెదక్ జిల్లా దుబ్బాకలో స్వామి వివేకానంద 156 వ జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో ముగ్గులపోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ముగ్గులపోటీలే కాకుండా ఆహ్లాదాన్ని పంచె మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.ఈ పోటీలను ఏబీవీపీ విద్యార్థులు దగ్గరుండి జరిపించారు. పోటీ అనంతరం అందమైన ముగ్గులను ఎంపిక చేసి బహుమతుల ప్రధానం చేశారు.