కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు ఇంటిపై దాడి చేసిన తెరాస నాయకులు..

0

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బీర్ల శంకర్ తమ్ముడు ఇంటిపై టీఆర్ఎస్ కు చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. కర్రలతో ఇంటితలుపును బాదడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న శంకర్ తమ్ముడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి ప్రచారం ముగించుకొని ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి తలుపులపై కర్రలతో దాడి చేశారని కుటుంభ సభ్యులు తెలిపారు. శబ్దం రావడంతో బయటకు వచ్చి చూడగా వారు స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలుగా గుర్తించారు. కాగా ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా ” బారా బర్ కొడతాం” అంటూ అసభ్యకర పదజాలంతో దూషించారని వారు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరాడు. అర్ధరాత్రి ప్రత్యర్థి ఇంటిపై ఎందుకు దాడి చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.