సికింద్రాబాద్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో సంక్రాంతి శోభ

0

సికింద్రాబాద్ లోని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కార్యాలయంలో సంక్రాంతిని పురస్కరించుకొని రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పోటీల్లో సంక్రాంతి సంప్రదాయాన్ని ప్రతిభింభించే విధంగా మహిళలు రంగవల్లులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్ర‌తిమ‌లు, బొమ్మ‌ల‌ కొలువులు, గొబ్బెమ్మలతో అందంగా అలంకరించారు. వీటిల్లో అందమైన రంగవల్లులను గుర్తించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందచేశారు. పోటీలో పాల్గొన్న‌ ప్ర‌తి ఒక్క‌రికి ప్రోత్సాహ‌క‌ బ‌హుమ‌తులు అంద‌జేశారు.ఈ సంద‌ర్బంగా ఎస్.బి.ఐ డిజిఎం సుధీర్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని విభిన్న‌ సంస్కృతులను ప్రోత్స‌హిస్తూ బ్యాంకు ఉద్యోగులు క‌లిసి క‌ట్టుగా పండుగ‌లు జ‌రుపుకుంటున్నార‌ని చెప్పారు. తెలుగు పండుగ‌ సంక్రాంత్రి సంద‌ర్బంగా బ్యాంకు ఉద్యోగులంతా క‌లిసి ఒక‌ కుటుంబం లా సంబ‌రాలు జ‌రుపుకున్నార‌న్నారు…