సిద్దిపేటలో ఘోర అగ్ని ప్రమాదం :

0

సిద్దిపేట జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని మోడల్ రైతు బజార్ ఎదురుగా ఉన్న కలప దుకాణంలో మంటలు చెలరేగాయి. దింతో దుకాణంలో ఉన్న ఎదురు బొంగులు మొత్తం దగ్దమయ్యాయి. మంటలు పక్కనున్న దుకాణాలకు వ్యాపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోనికి తెచ్చారు. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.