జంట నగరల్లో వరుస చోరీలకు  పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

0

జంట నగరాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో మొత్తం నలుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుల నుండి మూడు మోటార్ బైక్ లు ఒక స్కూటర్ తో పాటు పదిహేడు లాప్ టాప్ లు , ఇరవై ఐదు సెల్ ఫోన్లు, పది లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్న నిందితులను రిమాండుకు తరలించారు.