క‌ల్లూరు మండ‌లంలో ఎమ్మెల్యే సండ్ర ప‌ర్య‌ట‌న‌

0

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నేడు నియోజ‌క‌వ‌ర్గంలోని క‌ల్లూరు మండ‌లం ప‌ర్య‌టించారు. మండ‌లంలో ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌కు ఆయ‌న శంకు స్థాప‌న చేశారు. అనంత‌రం కార్య‌క‌ర్త‌లు ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడుతూ..

నియోజ‌క వ‌ర్గంలో అతి పెద్ద మండ‌ల కేంద్ర‌మైన క‌ల్లూరుతో పాటుగా, కొత్త‌గా ఏర్పడిన గ్రామ‌ పంచాయతీ లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామ‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల్లో పురోగ‌తి, సీసీ రోడ్ల నిర్మాణం త‌దిత‌ర ప‌థ‌కాల‌కు సంబంధించి మండ‌లానికి ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణను రూపొందించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతామ‌న్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్కినేని రఘు,కుంచాల వరలక్ష్మి ,కాటంనేని వెంకటేశ్వరరావు,బొబోలు లక్ష్మణరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, సతీష్ ,సర్పంచ్ లు మోహన్ ,వెంకటరెడ్డి,వార్డు సభ్యులు, నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు.