క్యూ నెట్ స్కామ్ పై పెద్దఎత్తున ఫిర్యాదుల వెల్లువ..

0

ఈ ప్రపంచంలో మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసేవారు పుడుతూనే ఉంటారు. సామాన్యుడికి ఆశ చూపి కొందరు వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి కేసునే సైబరాబాద్ పోలీసులు చేధించారు. క్యూ నెట్ పేరుతో మలేషియాలో ఉండే విజయ్ ఈశ్వర్ అనే వ్యక్తి “ఈ మార్కెటింగ్” పేరుతో వేలకోట్లు ఖాజేశారు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు నిందుతులనుపట్టుకున్నారు. కాగా ప్రస్తుతం ఇన్నాళ్లు పరువు పోతుంది అని మౌనంగా ఉన్న బాధితులు ఒక్కొక్కరూ బయటికి వచ్చి పోలీసులు, మీడియా తో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. క్యూ నెట్ బాధితులు భారీ ఎత్తున సైబరాబాద్ కమీషనర్ కు ఫిర్యాదులు అందిస్తున్నారు. ఈ సందర్బంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.