కేటీఆర్ దాతృత్వం .. పోలియో వ్యాధితో బాధ పడుతున్న యువకుడికి వైద్య సహాయం

0

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకుడే కాదు.. ప్రజల కష్టాలను పంచుకుంటాడని నిరూపించుకున్నారు. చిన్నతనం నుండి పోలియో వ్యధితో బాధపడుతున్న శివ సాయిరాం అనే బాలునికి తన సొంత ఖర్చులతో వైద్యం అందిస్తున్నారు కేటీఆర్. వివరాల్లోకి వెళితే రామగుండం నియోజక వర్గం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కి చెందిన రాజమల్లు – లక్ష్మి దంపతుల కుమారుడు శివసాయిరాం (9 ఏళ్ళు) చిన్నతనం నుండి పోలీయో వ్యధితో బాధపడుతున్నారు. కాగా ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన కోరుకంటి చందర్ వద్ద తమ ధీనస్థితిని చెప్పుకోగా ఆయన కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లగా, కేటీఆర్ తన సొంత ఖర్చులతో వైద్యం అందిస్తానని భరోసా ఇచ్చారు. చెప్పిన విధంగా హైదరాబాద్ లోని సన్ షైన్ హాస్పెటల్ లో ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు అంగీకరించడం తో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహకారంతో శివ సాయిరాం ను హైదరాబాద్ కు పంపించారు. ఈ సందర్బంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ…. యువ నాయకుడు కేటీఆర్, ఇచ్చిన మాట ప్రకారం ఇంత త్వరగా స్పందించడం చాలా సంతోషంగా వుందని, కేటీఆర్ కు రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.