ఏబీవీపి ఏ కులానికి, మ‌తానికి వ్య‌తిరేకి కాదు.

13
telangana, abvp .
telangana, abvp .

రాబోయే భ‌విష్య‌త్తు భార‌తాన్ని నిర్మించాల్సిన బాధ్య‌త యువ‌త‌పై ఉంద‌ని సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. ఏబీవీపి ఏ కులానికి, మ‌తానికి వ్య‌తిరేకి కాద‌ని, భారతీయుల‌ని మాత్ర‌మే ఏబీవీపి త‌యారు చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. బుధ‌వారం స్థానిక పాన‌గ‌ల్ మ‌హాత్మ గాంధీ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలో ఏబీవీపి ప‌రిచ‌య కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ.. భార‌త‌దేశంలో కులం పేరుతో, మ‌తం పేరుతో మ‌నుషుల‌పై రాళ్లు వేయ‌డం, బుర‌ద జ‌ల్ల‌డం వంటి చర్యలు ఆన‌వాయితీగా మారిపోతుంద‌ని అన్నారు.

విద్యావిధానంలో కూడా కులాల వారీగా, మ‌తాల వారీగా విడ‌గొట్టార‌ని ఆయ‌న అన్నారు. అయితే ప్ర‌స్తుత స‌మాజంలో వ్య‌క్తిని భార‌తీయుడిగా నిలిపేందుకు అఖిల భార‌తీయ‌ విద్యార్ధి ప‌రిష‌త్ కృషి చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశంలో కాదు.. ప్ర‌పంచ దేశాల వ్య‌క్తులు మ‌న సొంతం అని భావించే ప‌రిష‌త్ ఏబీవిపీ అని అందుకే విశ్వ వ‌సుధైక కుటుంబం అనే నినాదంతో ముందుకు వెళుతున్న‌ట్టు అప్పాల ప్రసాద్ తెలిపారు.