ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పెంచాలి

14
telanganba haritha haram.
telanganba haritha haram.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేసారని, ఈ నేపథ్యంగా నర్సరీలో జరుగుతున్న పనులను ఎంపీడీఓ పర్యవేక్షించడం జరిగిందని అన్నారు. ఈ నర్సరీలలో నలభైవేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

జూన్ జులైలో జరిగే హరితహారం కార్యక్రమంలో రైతులకు, గ్రామస్తులకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పెంచే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ.వో.పీ.ఆర్.డి మేఘమాల, సర్పంచ్ బానోత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.