ఓటు హక్కు” మన అందరి బాధ్యత ..” అక్కినేని నాగార్జున” ..

59
telangana elactions ,.akkineni nagrajuna family .
telangana elactions ,.akkineni nagrajuna family .

నేడు తెలంగాణ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపోలింగ్ ఈ రోజుఉదయం 7 గంటలకు ఆట్టహాసంగా ప్రారంభమైంది .. ఎన్నికల లో భాగంగా ఓటర్లు తమ ఓటు హక్కు ను రాజకీయ నాయకులూ , సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కు ను బాధ్యత గా వినియోగించుకుంటున్నారు..

సినీ హీరో అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో వచ్చి ఈ రోజు తన హక్కును వినియోగించుకున్నారు . అనంతరం మీడియా తో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో ఓటుహక్కు అనేది చాల పవిత్రమైనది, ఈరోజు అందరూ కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు ను వినియోగించుకువాలని పిలుపునిచ్చారు . ఓటుహక్కుఅనేది మనందరి బాధ్యత అని ఓటు వేయటం వలన పాలకులను నిలదీసే హక్కు ఉంటుందని ఆయన అన్నారు . రాజకీయాలు చెడిపోయాయని, వాటికి దూరంగా ఉండాలని ఎవరైనా అనుకుంటే, వారికి సమస్యలపై నిలదీసే హక్కుండదని అన్నారు .ఈ విషయంలో అధికారులు ఎంతగా ప్రజల్లో అవగాహన తెచ్చినా, పలువురిలో ముఖ్యంగా యువతలో రాజకీయాలపై ఓ చెడు అభిప్రాయం ఉందని, దాన్ని తొలగించుకుని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించాలని ఓటర్లను కోరారు ..