ముగిసిన” తెలంగాణ “ఎన్నికల ప్రచారం..

52
telangana elactions ..
telangana elactions ..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. మైకులు మూగబొయాయి.. ప్రచార గడువు ఈ సాయంత్రం ఐదు గంటలతో ముగిసి పోయింది.. ఎలక్షన్ కమిషన్ అదేశాలప్రకారం ఈ సాయంత్రం 5 గంటల తరువాత బహిరంగ సభల నిర్వహణపై నిషేధం విధించారు. సభలు, ఊరేగింపులు, సినిమా, టీవీల ద్వారా ప్రచారంపై ఆంక్షలు పెట్టారు. ఇక పోలింగే తరువాయి. ఈ నెల 7న 119 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.. ఈ నెల 7న ఉదయంసాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ఇక మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 4గంటలకే ప్రచార కార్యక్రమాలను ఎన్నికల సంఘము నిలిపివేసింది .. తెలంగాణ ఎన్నికల బరిలో మొత్తం 1,821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.. అత్యధికంగా హైదరాబాద్ జంటనగరాల్లో 3,873 కేంద్రాలను ఏర్పాటు చేశారు.. ఎన్నికల విధుల్లో భాగంగా 1,60,509 మంది సిబ్బంది పాల్గొంటున్నారు..

ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్‌ యూనిట్లు, 42,751 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, 39,763 కంట్రోల్‌ యూనిట్లను వినియోగించనున్నారు. ఎన్నికల విధుల్లో 649 మంది సహాయక రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు ఈనెల 11వ తేదిన వెల్లడిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ అధికారులు వెల్లడించారు.. ఇన్ని రోజులు వరకు నామినేషన్ నాటి నుండి అన్ని రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించారు.. ఇక తుది నిర్ణయం ప్రజాతీర్పు ఎటుందో వేచి చూడాల్సి ఉంది..