“పోలింగ్ కేంద్రం” లోకి ఎవరెవరు వెళ్ళవచ్చు . “ఎన్నికల కమిషన్” నిబంధనలు .

69
elaction commission .
elaction commission .

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యం లో భాగంగా కేంద్ర ఎన్నికలకమీషన్ కొన్ని నిబంధనలు విధించించింది . తెలంగాణ లో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలవుతుంది. ఈ నేపథ్యం లో పోలింగ్ కేంద్రం లోకి ఎవరెవరు వెళ్ళవచ్చు, ఎంతమంది ఒకేసారి వెళ్ళవచ్చు , అనే అంశాలపై ఎన్నికల సంఘం కొన్ని నియమ నిబంధనలు విధించింది .. అనుమతించిన వ్యక్తులకు మాత్రమే పోలింగ్ కేంద్రంలో కి అనుమతి ఉంటుంది .. ఈ జాబితాలో ఎన్నికల సంఘం ద్వారా అనుమతించిన వారు కొందరు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతించేవారు ఇంకొందరు ఉంటారు.

ఒకేసారి ఎంత మంది ఓటర్లను అనుమతించాలన్న అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతుల్లో ఉంటుంది. పోలింగ్‌ ఆఫీసర్లు, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తుల లోనికి వెళ్లవచ్చు. ఆ నియోజకవర్గంలో పోటీ పడే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు వెళ్లవచ్చు. ఓటు వేయడానికివచ్చేమహిళలు, చిన్నపిల్లలు అంథులు, వృద్ధులకు తోడుగా వచ్చినవారు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నియమించబడిన వ్యక్తులు లోనికి వెళ్లొచ్చు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని “ఎన్నికల కమిషన్”ఆదేశాలు జారీ చేసింది ..