“తెలంగాణ “ఎన్నికలపై “జనసేనాని” ఏమన్నాడో తెలుసా..?

313
janasena adinetha pavankalyan .
janasena adinetha pavankalyan .

 

తెలంగాణ ఎన్నికలు అనుకున్నదానికంటే ముందస్తుగా రావటంతో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీచేయటం లేదని గతంలో పవన్ కల్యాణ్ తెలిపిన విషయం అందరికి తెలిసిందే.. కానీ తన అభిమానులు, జనసైనికులు, రాజకీయ నేతలు తెలంగాణ ఎన్నికల పై స్పందించాలని పవన్ కల్యాణ్ ని కోరగా ఆయన తన ట్విట్టర్ ద్వారా స్పందించారు..

ఎంతో మంది కలలు కని పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో నిర్దేశించాల్సింది కూడా ప్రజలే అని, తెలంగాణ వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశించిన యువత ఎంతో మంది ఆత్మబలిదానాలు చేశారిని గుర్తుచేశారు.. అలాంటి తెలంగాణ రాజకీయాల్లో నేడు యువతే కీలక పాత్ర పోషించాలని పవన్ తెలిపారు.. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రాన్ని ఇచ్చామని కొందరు, రాష్ట్రంలో అభివృద్ధి కి బాటులు వేశామని కొందరు.. ప్రజాపాలన చేశామని మరికొందరు ప్రచార కార్యక్రమాల్లో చెబుతున్నారని ఇవన్ని పక్కన పెట్టి రానున్న ఐదు సంవత్సరాల్లో ఎవరైతే తెలంగాణను అభివృద్ధి చేస్తారనేదానిపై తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు కూడా లోతుగా ఆలోచించి తమ ఓటు ను అభివృద్ధి చేసే నాయకులకు వేసి గెలిపించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మీరే నిర్ణయించాలని ప్రజలకు జనసేనాని పిలుపు నిచ్చారు.. తెలంగాణ ప్రజల కష్టాలను, వారి జీవినాస్థితి గతులను దగ్గరుండి చూసిన వ్యక్తుల్లో తాను ఓక్కడినని ప్రజలకు తెలిపారు..