నేడు తెలంగాణ లో జరుగుతున్న ఎన్నికల్లో ” నందమూరితారక రామారావు ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు .. మీడియా తో మాట్లాడుతూ..
ఓటుహక్కుఅనేది “భారత రాజ్యాంగం” మనకు కల్పించిన హక్కు .. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు . ఓటు వెయ్యాలనేది ఒకరు చెబితే వచ్చేది కాదని ” మనసా ,వాచా, కర్మణా ” మనలో కలగాలని అన్నారు .. కూకట్ పల్లి నియోజక వర్గం లో పోటీ చేస్తున్న తన సోదరి నందమూరి సుహాసిని విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు .. తనతో పాటు క్యూ లైన్ లో వేచి ఉన్న ఓటర్లతో , సెల్ఫీలు దిగుతూ , ఉత్సహంగా పలకరిస్తూ ముందుకుకెళ్లారు…