“కేసీఆర్ విజయం కోసం ఏపీలోని” అన్నవరం” పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు..

25
trs party kcr
trs party kcr

రేపు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నా తరుణం లో తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి “కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రేపు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరుతూ ఆయన అభిమానులు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం “అన్నవరం” లో కెసిఆర్ గెలుపు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ..

ఆయన అభిమానులు మాట్లాడుతూ డిసెంబర్ 7 న జరిగే తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ 100సీట్లు సాధించి తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరుతూ ఈ రోజు “ఆంధ్ర కెసిఆర్” ఫౌండేషన్ ద్వారా తూర్పు గోదావరి జిల్లా లోని అన్నవరం సత్నారాయణస్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, అన్నారు .

కెసిఆర్ గారు తెలుగు రాష్ట్ర రైతులకోసం ఎంతో మేలు చేసారని , రైతు బందు , రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టి రైతులను ప్రోత్సహించిన నాయకులూ ఎవరైనా ఉన్నారంటే కెసిఆర్ ఒక్కరే అని అన్నారు .. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ క్రియాశీలక రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ తీసుక రావాలని తెలుగురాష్ట్రాలు అయిన తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లో పాలన సాగించాలని
కోరుకున్నారు ..