” ఉత్తమ్ శపధం”నేరవేరదు.. మళ్లీ అధికారంలోకి వచ్చేది “టీఆర్ఎస్” పార్టీనే.. : కేటీఆర్.

51
telangana elactions ktr road show ,in javahar nagar.
telangana elactions ktr road show ,in javahar nagar.

తెలంగాణ ఎన్నికల్లో ఏకైక పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, అన్ని నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యాటనలు చేస్తున్నారు.. ఒక పక్క కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటుంటే మరో పక్క కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.. తాజాగా హైదరాబాద్ లోని జవహార్ నగర్ లో నిర్వహంచిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు.. జవహార్ నగర్ ప్రజలు పెద్ద త్యాగం చేస్తున్నారని కొనియాడారు.. జవహార్ నగర్ నియోజక వర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లా రెడ్డి ఇక్కడ సమస్యలను తనకు వివరించారని తెలిపారు..

ఇక్కడ ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యాడ్ ను అధికాంలోకి వచ్చిన తరువాత ఆధునిక టెక్నాలిజీతో అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.. రోడ్లు సరిగా లేవని తనకు మల్లా రెడ్డి వివరించారని వాటిని కూడా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.. ప్రజల విన్నవిచుకున్న ప్రతి పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు..మీ సమస్యలను పట్టించుకునే ఇలాంటి నాయకుడికి తప్ప ఇంకేవరికి ఓటేస్తారని ప్రజలను ప్రశ్నించారు..

టీఆర్ఎస్ ను గద్దెదించే దాక గడ్డం తీయనని ఓ కాంగ్రెస్ నేత అన్నారని ప్రజలకు గుర్తు చేశారు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీసుకోక పోతే కేసీఆర్ కు వచ్చిన నష్టం ఏమిలేదని ఎద్దేవ చేశారు.. కూటమిగా నాలుగు పార్టీలు ఏర్పడి నాలుగు ఖండువాలు మెడలో వేసుకొని తిరుగుతున్నారని వాళ్ల మాటలు నమ్మవద్దు అని ప్రజలకు హితవు పలికారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని జాతీయ పార్టీల నాయకులు సైతం తెలంగాణలో అడుగు పెడుతున్నారని, ఎన్నికల వరకు ఆ పార్టీల అధినేతలు తెలంగాణ లో అడుగు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే సమయం ఉందని ప్రజలు ఆలోచించి తెలంగాన అభివృద్ధి చేసే నాయకులకే ఓట్లు వేయాలని కేటీఆర్ ప్రజలను కోరారు.. జవహార్ నగర్ అభివద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి మల్లా రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాని ప్రజలకు పిలుపునిచ్చారు..