కేసీఆర్ సింహం అయితే జూలో పెట్టాలి… : వి.హెచ్ . హనుమంత రావు..

42
kukatpally prajakutami meating ..
kukatpally prajakutami meating ..

కూకట్ పల్లిలోని టీడీపీ కార్యాలయం లో మహాకూటమి నేతలు భేటి అయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. హనుమంత రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొడంగల్ లో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రేసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించి తలుపులు బద్దలు కొట్టి బెడ్రూం వరకు పోలీసులువెళ్ళటం దారుణమని ఆయన అన్నారు.. దీన్ని ప్రతి నాయకుడు ఖండించాల్సి ఉందని అన్నారు..

ప్రజాప్వామ్యంలో బతుకుతున్నామా లేక దొరల పాలనలో ఉన్నామా ప్రజలు ఒక్కసారి గుర్తుచేసుకోవాలని సూచించారు.. రేవంత్ రెడ్డిని ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం కెసిఆర్ దుర్మార్గపు పాలనకు నిదర్శనం అని విహెచ్ ద్వజమెత్తారు.. కేసీఆర్ సింహం అని ఆయన వారసులు చెపుతున్నారని, అడవుల్లో సింహాలు ఉంటాయి .. లేదా ప్రజల సందర్శనార్థం జూ పార్క్ ల్లో ఉంటాయని ఎద్దేవ చేశారు.. కేసీఆర్ నువ్వు సింహం నువ్వు రోడ్ల మీద తిరుగుతుంటే ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.. అందుకే నిన్ను జూలో పెట్టాలని సంబంధిత అధికారులకు లెటర్ రాస్తున్నా అని విహెచ్ అన్నారు..

కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరల్లో ఉన్నాయని తెలిపారు.. ఎంఐఎం వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలవా ..? నీకు దమ్ముంటే నీవు ఓల్డ్ సిటీలో తిరగ్గలవా అని హనుమంత రావు ప్రశ్నించారు.. టీఆర్ఎస్ నాయకులు దుర్మార్గపు చర్యల కు పాల్పడుతున్నారని ఇలాంటి నియంత పాలన అవసరమా అని మీడియా ముఖంగా ప్రజలను ప్రశ్నించారు… కూకట్ పల్లి లో మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని విహెచ్. హనుమంతరావు తెలిపారు .