“మజ్లిస్ ” పై బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి .. అసదుద్దీన్ ఒవైసీ .

35
asududdin oyc pressmeet.
asududdin oyc pressmeet.

మజ్లీస్ పార్టీ పై కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఎంఐఎం అధినేత “అసదుద్దీన్ ఒవైసీ ” కుట్ర రాజకీయాలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ ల పై మండిపడ్డారు .. తమపార్టీ ని అణగదొక్కేందుకు అణిచివేసేందు కు కుట్రలు చేస్తూన్నారని ఆరోపించారు .. ఎంఐఎం పార్టీ ఎవరికీ తోక పార్టీ కాదని అన్నారు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నా తరుణం లో ప్రస్తుతం వెలువడుతున్న సర్వేల పై ఆయన స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీ లు ఎన్ని సర్వేలు చేసిన తెలంగాణ లో కేసీఆర్ భారీ మెజారిటీ తో గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశం లో అని జోస్యం చెప్పారు..

2019 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు లో ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయని తెలిపారు.. త్వర లోనే ఎంఐఎం పార్టీ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.. టిఆర్ఎస్ పార్టీలో చేరే ఆలోచన లేదని లగడపాటి చేస్తున్న సర్వేలపై మాట్లాడుతూ సర్వేలపై ఎన్నికల సంఘము ప్రత్యేక దృష్టి సారించాలనికోరారు . ఎవరెన్ని సర్వేలు చేసిన తెరాస గెలిచి తీరుతుందని అన్నారు.. తెలంగాణ లో మహాకూటమి అధికారం లోకి వస్తే మద్దత్ ఇస్తారా అన్న మీడియాప్రశ్న కు స్పందిస్తూ ఈ విషయం లో ఇప్పుడే ఎం చెప్పబోమని ఎన్నికల ఫలితాల అనంతరం ఎం చెయ్యాలో నిర్ణయం తీసుకుంటామని మీడియా సమావేశము లో ఆయన అన్నారు ..