“ఈవీఎం”లో ఏ గుర్తు ఎక్కడుందో కనిపించటంలేదు.. : పోసానికృష్ణ మురళి ..

100
telangana elactions . posani krishna murali .
telangana elactions . posani krishna murali .

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.. కాగా తన ఓటు హక్కును వినివోగించుకోవటానికి వెళ్లిన సినీ ప్రముఖుడు పోసాని కృష్ణ మురళి ఎలక్షన్ కమిషన్ చేసిన ఏర్పాట్లపై తన దైన శైలితో అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డి గూడ పీజేఆర్ కమ్యూనిటి హాల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన పోసాని ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం లు ఉంచిన చోట సరిగా వెలుతురు లేదని అందుచేత ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించలేదని అన్నారు.. దీనివల్ల కంటిచూపు మందగించిన వృద్ధులు తనకన్నా అత్యధికంగా ఇబ్బంది పడుతున్నారని పోసాని తెలిపారు..