కూకట్ పల్లి ఎన్నికల ప్రచారానికి “ఎన్టీఆర్” దూరం..

87
kukatpally
kukatpally

తెలంగాణ ఎన్నికల లో భాగంగా ప్రజకూటమి తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే .. ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్న్మకంగా తీసుకున్న తెలుగు దేశం పార్టీ సుహాసిని గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు .

కూకట్ పల్లి అభ్యర్థి సుహాసిని తరుపున ఏపీ సీఎం చంద్రబాబు , బాలకృష్ణ,పరిటాలసునీత ,తారకరత్న ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈరోజు సుహాసిని తరుపున ప్రచారం చెయ్యటానికి తన తమ్ముళ్లు  జూనియర్ ఎన్టీఆర్  కళ్యాణ్ రామ్ పాల్గొంటారని పార్టీ వర్గాలు భావించాయి.. కానీ సినిమా షూటింగ్ ల్లో బిజీ గా ఉన్న “నందమూరి బ్రదర్స్” రాకపోవడం తెలిసి పార్టీ వర్గాలు అభిమానులు కార్యకర్తలు ఒకింత నిరాశ చెందారు .. రాజమౌళి దర్శకత్వం లో మల్టీ స్టారర్ చిత్రం లో ఎన్టీఆర్ రాంచరణ్ నటిస్తున్నారు .. ఈ సినిమా తో బిజీ గా ఉన్న ఎన్టీఆర్ కూకట్ పల్లి నియోజకవర్గ ప్రచారానికి దూరం ఉన్నట్లు సమాచారం .. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం తో ఆయన కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు.