“తెలంగాణ” ప్రజలారా మీరు సిద్దమా…

0

తెలంగాణ ఎన్నికల కోలాహలంగా నిన్నటి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.. ఓటర్లను ఆకట్టుకోవడానికి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ప్రచార కార్యక్రమాలతో ఓటరు ను ఆకట్టుకునేందుకు విమర్శలు, ప్రతి విమర్శలతో సభలు, రోడ్ షోలు అన్ని ముగిసిపోయాయి.. ఇక మిగిలింది ఓటరు తీర్పు మాత్రమే..

ఓటర్లు ఏ పార్టీకి అధికారం ఇస్తారో వారి చేతుల్లోనే ఉంది.. ఎన్ని సర్వేలు, ఎందరు రిపోర్టులు ఇచ్చిన చివరకు ఓటరు తీర్పు మాత్రం ఎలా ఉంటుందో అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా అయోమయంలో పడ్డారు.. మరో పక్క ఓటర్లును ప్రలోభ పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే పలు చోట్ల ఓటర్లకు పంచడానికి నేతలు పంపిన డబ్బును భారీ మొత్తంలో పోలీసు అధికారులు స్వాధినం చేసుకున్నారు.. ఇక ఎన్నికలకు మరి కోన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది.. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో తెలియాలంటే డిశంబర్ 11వ తేది వరకు వేచి చూడాల్సి ఉంది..

తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్చందంగా విని యోగించు కోవాలని ఇప్పటికే అనేక స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక్షంగా, పరోక్షంగా ప్రజలకు తెలియజేశారు. ఇక మిగిలలింది ప్రజల తీర్పు మాత్రమే ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర అన్ని సంస్థలకు రేపు సెలవు ప్రకటించారు.. గత ఎన్నికల్లో 60 శాతం ఓట్లు పోలవగా ఈ ఎన్నికల్లో మరింత శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వెళ్లడించారు..

ఇప్పటికే అన్ని ప్రాంతాలకు ఈవిఎం యంత్రాలు, అధికారులు పూర్తీ భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.. ఇక ప్రజల తీర్పు కోసం 119 నియోజక వర్గాల్లో 1821 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.. మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టబెడతారో వేచి చూడాలి..