ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి ప్రకటించిన సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్రంతోపాటు దేశంలోని పలు సర్వేలు కారు జోరు మీదుందని, దానికి అడ్డువస్తే మటాషే అని చెబుతున్నా, కేవలం ఆంధ్రాబాబుల కోసం, ఎల్లో మీడియా కోసం చేసిన, ప్రకటించిన వండి వార్చిన సర్వే అని క్లియర్‌గా అర్ధం అవుతోందని విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే లోగుట్టును బయటపెట్టేశాడు టీఆర్ఎస్ యువనేత కేటీఆర్.
రెండు వారాల క్రితం తనకు, లగడపాటికి మధ్య జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్‌ని రిలీజ్ చేసి ఆంధ్ర ఆక్టోపస్ నిజస్వరూపం బయటపెట్టాడు. నవంబర్ 20వ తేదీన జరిగిన ఈ సంభాషణలో టీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నట్లు, గులాబీ పార్టీ ఈజీగా 67-75 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని అభిప్రాయ పడ్డారు లగడపాటి. కాంగ్రెస్ – టీడీపీ కూటమికి 35-40 స్థానాలు మాత్రమే దక్కుతాయని క్లియర్‌గా సంకేతాలు ఇచ్చారు ఆంధ్ర ఆక్టోపస్.. అప్పటికి టీఆర్ఎస్ అధినేత, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మలిదశ ప్రచారానికి అడుగు పెట్టలేదు. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది..
గత వారం రోజులలో ముఖ్యంగా రాహల్‌గాంధీ, చంద్రబాబు ఎంటర్ అయిన తర్వాత సీన్ మరింత మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఆ ఇద్దరి కలయికని జనాలు జీర్ణించుకోవడం లేదని, బాబుతో పొత్తును తెలంగాణ ఓటర్లు ఛీ కొడుతున్నారని, కాంగ్రెస్ నేతలు సైతం దీనిపై విస్మయంవ్యక్తం చేస్తుండడం, క్షేత్ర స్థాయిలో పొత్తు వికటించిన సంకేతాలు వెలువడడం బాగా కలిసి వచ్చిందని, అది తమకు అడ్వాంటేజ్‌గా మారుతుందని భావిస్తోంది గులాబీ దండు..
కేసీఆర్, హరీష్ తెలంగాణ గ్రామీణంపై పట్టు పెంచితే, ఇటు, కేటీఆర్ హైదరాబాద్‌తోపాటు పలు పట్టణాలపై ఫోకస్ పెంచారు. నిజామాబాద్ ఎంపీ కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలపై పూర్తి గా ఫోకస్ పెట్టారు. ఇలా,పక్కా వ్యూహంతో ముందుకు కదులుతుండడం వారికి బాగా కలిసి వచ్చిందని చెబుతున్నారు.. ఇదే కూటమికి పూర్తి ఝలక్ వివరిస్తున్నారు పరిశీలకులు.