“ఢిల్లీకో కేసీఆర్” కావాలి..! ఇదే “ప్రజాభిప్రాయం”..!

153
trs,party kcr.
trs,party kcr.

గుజరాత్ మోడల్ పేరుతో ఢిల్లీ పీఠం దక్కించుకున్నమోదీ చేసిందేమీ లేదు. కానీ. .తెలంగాణ నమూనాతో…కేసీఆర్ .దేశ ప్రజల దృష్టి ని ఆకర్శించారు .. రైతు బంధు పథకం…ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇరవై నాలుగు గంటల కరెంట్… దేశంలోఅందర్నీ అబ్బుర పరిచింది. నీటిని సద్వినియోగం చేసుకోని కాంగ్రెస్, బీజేపీల దౌర్భాగ్య పరిస్థితిని కళ్లకు కట్టేలా చేశారు. అందుకే తెలంగాణ నమూనానే కేంద్రంలో అమలు చేయాలన్న భావన దేశ ప్రజల్లో పెరుగుతోంది. అలా జరుగాలంటే కేసీఆర్ వంటి నాయకులు జాతీయ రాజకీయ వేదికపై ప్రధాన భూమిక పోషించాలి. భారతదేశం పేద దేశం కాదు. వనరులు, నిధులు లేక కాదు. పొంగిపారెడు నదులు, తరగని జలసిరులు దేశమంతటా ఉన్నాయి…

సంపద సృష్టి ఎంతగా జరుగుతున్నా, అది పునఃపంపిణీ జరగడం లేదు. కేంద్రం చేతిలో ఆర్థిక అధికారాలు ఎక్కువగా కేంద్రీకృతం కావడం, అక్కడ ప్రజాకేంద్రక విధానాలు అమలు చేయకపోవడం, కంపెనీ అనుకూల విధానాలు అమలు చేయడం కొద్దిమంది చేతిలో సంపద పోగుపడడానికి కారణమవుతున్నది. నరేంద్రమోదీ హయాంలో కొత్తగా ఉత్తర, దక్షిణ భారతాల మధ్య కూడా ఒక స్వార్ధ వాతావరణం తలెత్తింది ..
మోదీ ప్రభుత్వంలో దక్షిణ భారతానికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, నిధులు, ప్రాజెక్టుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గురికావడం ఇందుకు కారణం. తెలంగాణ ప్రభుత్వం సంపదను ప్రజలకు పంపిణీ చేయడంలో కొత్త చరిత్రను సృష్టించింది. రుణాల మాఫీ, అన్ని రకాల పింఛన్లు, కల్యాణ లక్ష్మి, సీసీ రోడ్లు, చెరువు పూడికతీత, ట్రాక్టర్ల మంజూరు, లిఫ్టు ద్వారా నీళ్ల మళ్లింపు, గొర్రెల పంపిణీ, విదేశాల కు వెళ్లే విద్యార్థులకు రుణాలు, దళితులకు భూమి… ఇంకా అనేక పథకాల కింద ప్రజలకు సంక్షేమం అందింది. తెలంగాణ నమూనానే కేంద్రంలో అమలు చేయాలి.

రైతుల సమస్యలను పరిష్కరించే విషయంలో కేసీఆర్ విధానాలు.. అద్భుతం. అవి దేశం మొత్తం అమలు చేస్తే .. రైతు రాజు అవుతాడు. కేసీఆర్ రైతు కార్పొరేషన్ అందు కు శ్రీకారం చూడోతోంది . ఇది పూర్తి స్థాయిలో అమలయితే.. ప్రతిగ్రామమూ ఒక పట్టణమే అవుతుంది. తెలంగాణలో వస్తున్న మార్పును, జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్నవారెవరైనా కేసీఆర్ కేంద్రంలో కూడా క్రియాశీల పాత్ర పోషించాలని కోరుకుంటారు. ప్రాంతీయ నాయకులు జాతీయస్థాయిలో నిర్ణాయక పాత్ర పోషించవచ్చునని, ఉత్తరాది ఆధిపత్యాన్ని సవాలు చేయవచ్చునని 1990ల జాతీయ రాజకీయాలు రుజువు చేశాయి. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ అదే చేయగలుగుతారు…