“తెలంగాణ” భవిష్యత్‌ కోసం ఓటు..!” నిర్ణయం” మీదే…!!

0

తెలంగాణ భవిష్యత్‌ కోసం ఓటు..!
నిర్ణయం మీదే…!!

తెలంగాణ అస్థిత్వం సీమాంధ్రులు మరోసారి దాడి చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల సమయంలోనూ వారు సీమాంధ్ర ధనికవర్గాల తెలుగు దేశం పార్టీని తెలంగాణపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు, చంద్రబాబుకు గల బద్ధవైరం గురించి తెలిసి కూడా ఆ పనిచేయటం తెలంగాణ భావోద్వేగతకు, ప్రయోజనాలకు పూర్తి విరుద్ధం. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు వ్యతిరేకమవుతున్నది. కాంగ్రెస్ ఇక్కడ ప్రయోజనాలకు కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. ప్రాజెక్టులపైన, ఉద్యోగ నియామకాలపైన కేసులు, ఇతరత్రా అభివృద్ధికి ఆటంకాల వంటివి గత నాలుగున్నఏళ్ళ సవత్సరాల రికార్డు కాగా, టీడీపీతో కలిసి కూటమి ఏర్పాటు అందుకు తాజా ఉదాహరణ.

సీపీఐ తీరు కాంగ్రెస్‌కు ఎక్కువ భిన్నంగా లేదు. సాంకేతికంగా చూసినప్పుడు టీజేఎస్ తెలంగాణ పార్టీనే .. కానీ కూటమిలో చేరి అస్థిత్వాన్ని పోగొట్టుకుంది. ఈ ఎన్నికల అనంతరం అసలు ఉనికి అంటూ నిలిచి ఉంటే. మరొకవైపున టీఆర్‌ఎస్ ఉంది. టీఆర్‌ఎస్ తన స్వభావానికి, ధర్మానికి, లక్ష్యాలకు భిన్నంగా ఏదీ చేయలేదు. అది రాజకీయం, పరిపాలన, అభివృద్ధి, ఇతరులతో సంబంధాల వంటివి ఏవైనా కావచ్చు. ఎవరికివారు తమ వ్యక్తిగత ఇష్టాలను ఉంచుకుంటూనే, పైన చర్చించిన అంశాల గురించి నిష్పక్షపాతంగా ఆలోచించినట్లయితే నిజం ఏమిటో గుర్తించటం కష్టం కాదు. తొలి ఎన్నికలలో గెలిచిన ఒక తెలంగాణ పార్టీ, భవిష్యత్తు కోసం నిలదొక్కుకునేందుకు ఈ ఎన్నికలు కీలకం. అందుకే ప్రజలు ఆలోచించాలని పదే పదే కేసీఆర్ ప్రతి సభలోనూ కోరుతున్నారు.

తెలంగాణ అస్థిత్వం నిలబడాలంటే.. తెలంగాణ పార్టీ బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే..దేశంలో ప్రత్యేకత తెలంగాణకు ఉటుంది.అలా కాకుండా.. జాతీయ పార్టీకి ఓటు వస్తే..అన్ని రాష్ట్రాలతో కలిసిగా ఉటుంది కానీ.. కానీ పట్టించుకనేవారు ఉండరు. తెలంగాణ అస్థిత్వం కోల్పోతుంది. ఇప్పటికే అనేక రకాలైన సూచనలు.. దీని ప్రకారం అందుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా జరగుతోంది. అసలు ఇక్కడి దాకా రావడమే ఆశ్చర్యం . ఆయన ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం జరుగుతున్నా.. కాంగ్రెస్ నేతలు ఖండించకపోవడం మరో దారుణం. ఈ పరిస్థితి తెలంగాణను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ప్రజలే ఆలోచించాలి..!