తెలంగాణ ఎన్నికల్లో మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన ఆంధ్ర ఆక్టోపస్…

294
telangana elections lagapati sarve
telangana elections lagapati sarve

ఎన్నికలు అనగానే అందరు ఆసక్తికంగా ఎదురు చూసేది ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి సర్వేపైనే అంచనాలు ఉంటాయి.. తాజాగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే గెలిచే ఇద్దరు అభ్యర్థుల పేర్లను తెలిపిన లగడపాటి తాజాగా మరో ముగ్గురు అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.. తాను పార్టీలకు అతీతంగా సర్వేని నిర్వహిస్తానని తెలిపారు.. 2009, 2014 ఎన్నికల్లో లగడపాటి చెప్పింది నిజమైందని అన్నారు.

ఈ ఎన్నికల్లో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని మొన్న చెప్పానని, ఇప్పుడు మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను చెబుతానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ రెబెల్ మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి , బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థి జి.వినోద్ గెలుస్తారని తన సర్వేలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు..