కేసీఆర్ ఇదేనా నీ పాలన… బంగారు తెలంగాణ సాదించింది ఇందు కేనా : రేవంత్ రెడ్డి

0

హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన (టీయూడబ్ల్యూజే) సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుపడ్డారు.. రాజకీయంగా తనపై ఎన్నికేసులు పెట్టినా తనకు ఎదుర్కొనే దమ్ముందని కానీ తన ఒక్కగాను ఒక్క కూతురు పెళ్లి జరుగుతుంటే జైల్లో ఉన్న నాకు బెయిల్ రాకుండా ఢిల్లీ నుండి పెద్ద పెద్ద లాయర్లను రప్పించి పైశాచిక ఆనందం పొందిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆవేధన వ్యక్తం చేశారు.. అనంతరం అమాయక గిరిజన ప్రజలను అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి తూటాలతో హతమార్చారని ఘనత కేసీఆర్ గారిదే అని ఆరోపించారు.. తెలంగాణ బిడ్డలైన శృతి, సాగర్, వివేక్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హతమార్చి .. అమాయకుల ఎన్‌కౌంటర్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పోట్టన పెట్టుకుందని విమర్శించారు.. తెలంగాణ రాష్ట్రం కలలు కని సాదించుకున్నా ప్రజలు ఆశించిన విధానానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్రంలో పాలనలో సాగుతోందని ఆయన మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి తీరుతుందనే ధీమాను వ్యక్తం చేశారు.. .. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం దిశగా పాలన ఉంటుందని రెవంత్ రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని నేరుగా ఎదుర్కొలేక టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరివరకు తాను ప్రజలు పక్షాన పోరాడుతానని రేవంత్‌ రెడ్డి తెలిపారు..

ఒక పక్క రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగులు, సామన్య ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం గుర్తించి ప్రణాళికలను సిద్దం చేశామని ముఖ్యంగా రైతులకు కేవలం రుణమాఫీ లాంటి విముక్తి కాకుండా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.. . ప్రతీ ఏడాది ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే అన్ని శాఖల నుంచి ఖాళీలను గుర్తించి .. వచ్చే తెలంగాణ రాష్ట్ర దినోత్సవం నాటికి కొత్త నియామకాలను చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.. తెలంగాణ లో జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ దోహద పడుతుందని జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు..