అర్ధరాత్రి విడుదలైన మా ఎన్నికల ఫలితాలు.

202
telugu movies, maa elactions.
telugu movies, maa elactions.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పీఠం కోసం శివాజీ రాజ- నరేశ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో నటుడు నరేశ్ విజయం సాధించాడు. మార్చి 10 ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ‘మా’ లో మొత్తం 745 ఓట్లు ఉండగా ఈసారి అత్యధికంగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికల్లో మొదటి ఓటును నరేశ్ వేయగా, చివరి ఓటును హాస్యనటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నాడు. కృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడంతో జూబ్లీహిల్స్‌లోని ఫిలించాంబర్ సందడిగా మారింది. కాగా, ఆదివారం అర్ధరాత్రి దాటాక ఫలితాలను వెల్లడించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా జీవితారాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించింది.