అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రోరైళ్లు నడిపేందుకు మార్గం సుగమం

36
hydarabad metro train.
hydarabad metro train.

అమీర్‌పేట-హైటెక్‌సిటీ 10కి.మీ మార్గంలో మెట్రోరైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో రైళ్లు నడిపేందుకు కమిషన్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ ఆమోదం తెలిపింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున సాదాసీదాగా మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఎలాంటి హడావుడి లేకుండానే మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే హైటెక్‌ సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ, మెట్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.